విశ్వనాథవారి రామాయణ కల్పవృక్షంలో ...
7. “ఇదమిత్థమని నిర్ణయింపగారాని దే /కోర్కియో రూపుఁగైకొన్నయట్లు
జన్మజన్మాంతర సంగతమ్మైన యా / శా బలంబవధికి సాగినట్లు
ప్రాణముల్ బయటికి వచ్చి ముగ్ధాకార / మెనయించి దర్శనమిచ్చినట్లు
తన సృష్టిలోని యుత్తమభావమానంద / ముగఁబొంగి బింబమై పొడిచినట్టు
లలయరుంధతియును, నహల్యయును,
గోసలాత్మజాతయు మువ్వురి యాననముల
కన్నను బవిత్రమగుచు ,శృంగారభావ
మొడిసిపట్టిన ముఖచంద్రుడొకడు తోచె!”
(బాలకాండ – ధనుఃఖండము)
విశ్వామిత్రుని ఆమోదంతో రాముడు శివధనుస్సును తాకటానికి ముందుకు వెడుతూ, జనకరాజ సౌధంలో- పై అంతస్తులో అంతఃపురస్త్రీల కదలిక గుర్తుపట్టి అప్రయత్నంగా తలయెత్తి చూశాడు.
“ఇది” అని నిశ్చయంగా చెప్పలేని ఏ తీపి కోరికయో రూపుదాల్చినట్టు, ఎన్నిజన్మల సాన్నిహిత్యమో లక్ష్యానికి చేరినట్టు, ప్రాణాలు ముగ్ధాకృతితో మిళితమై దర్శనమిచ్చినట్టు ,సృష్టిలోని ఉత్తమ భావం ఆనంద బింబమై ఉదయించినట్టు -అరుంధతి,అహల్య,కౌసల్యల ముఖాలను మించిన పవిత్రతతోబాటు –శృంగార భావాన్ని చేపట్టిన ముఖచంద్రబింబం ఆయనకు కనిపించింది. ఆరూపం ఎవరిదీ ! సీతమ్మదే ! ఈ ప్రథమ వీక్షణాన్ని ఎంతో మహోదాత్తంగా చిత్రించారు విశ్వనాథ.
శివధనుర్భంగమయింది. “చెఱుకుగడవోలె నడిమికి విఱిగె ధనువు”, “సీత పూజడ వెన్నుగా శిరసువంచె ” అన్నారు . పూల జడయే వెన్నుగా తలవంచి సిగ్గుల మొగ్గయైన సీతమ్మ అందాన్ని మనం ఊహించు కోవలసినదే ! సీతారాముల ముత్యాల తలఁబ్రాల శోభను -
“అలుపములు రెండు, మూడు ముత్యాలు నిలచి
సీత పాపటలోఁజిఱుచెమట పోసె
హత్తుకొని గందపూత ముత్యాలు రెండు
రామచంద్రుని మేనఁదారకలు పొలిచె” అనే పద్యంలో రమణీయంగా చెప్పారు.రెండు,మూడు చిన్ని ముత్యాలు సీతమ్మపాపటలో చిఱుచెమటపట్టినట్టు కనిపించగా , నీలగగన ఘనశ్యాముడైన రాముని శరీరం మీద హత్తుకొన్న రెండు ముత్యాలు నక్షత్రాలు మొలిచినట్టున్నాయట ! వాల్మీకి రామాయణంలో పరశురామవృత్తాంతం సీతారామవివాహానంతరంఉంది. కానీ రామాయణ కల్ప వృక్షం లో వివాహానికి ముందే ఉంది.